రూ.315 కోట్లిచ్చి వదిలించుకుందట!

Wed,March 13, 2019 01:49 AM

Google Paid India-Born Executive Accused Of Sexual Harassment

-లైంగిక ఆరోపణలపై భారత ఉద్యోగికి గూగుల్ రాజీనామా ప్యాకేజీ

శాన్‌ఫ్రాన్సిస్కో, మార్చి 12: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. దుష్ప్రవర్తన కలిగిన ఓ భారత ఉద్యోగిని కోట్లాది రూపాయలిచ్చి వదిలించుకున్నది. ఏకంగా 45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.315 కోట్లు) చెల్లించిం ది. లైంగిక వేధింపుల ఆరోపణలపై 2016లో అమిత్ సింఘాల్ రాజీనామా చేయగా, సంస్థ నుంచి బయటకు వెళ్లేందుకు ఆయనకు ఈ మొత్తాన్ని గూగుల్ ఇస్తామని అంగీకరించింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపై ఓ భాగస్వామి వేసిన దావాతో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, తనపై సింఘాల్ అనుచితంగా ప్రవర్తించారని ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ చేస్తే ఆ సమయంలో సింఘాల్ మద్యం సేవించి ఉన్నట్లు తేలిందని గూగుల్ తెలిపింది. సంస్థలో లైంగిక వేధింపులకు ఏ రకంగానూ తావు లేకుండా చూస్తున్నామని, ఇలాంటి ఘటనలకు కారణమైనవారిని వదిలించుకోవడానికి గూగుల్ వెనుకాడబోదని, అందుకు ఈ భారీ ఎగ్జిట్ ప్యాకేజే నిదర్శనమని చెబుతున్నది. బలవంతంగా రాజీనామా చేయించినందున రెండేండ్లపాటు 15 మిలియన్ డాలర్ల చొప్పున, మూడో ఏడాది 5 నుంచి 15 మిలియన్ డాలర్లదాకా చెల్లిస్తామని గూగుల్ సింఘాల్‌కు హామీ ఇచ్చింది. 2016 వరకు గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్‌ను సీనియర్ ఉపాధ్యక్షుడి హోదాలో సింఘాల్ చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. గూగుల్ నుంచి ఊబర్‌లో చేరిన సింఘాల్.. అక్కడ కూడా రాజీనామా చేయగా, దానికి కారణం గూగుల్ లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగు చూడటమే. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ కి చెందిన సింఘాల్.. ఐఐటీ రూర్కీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకున్నారు. మిన్నెసోటా డులుత్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ డిగ్రీనీ పొందారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించేందుకు సింఘాల్ నిరాకరించారు.

2122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles