పోకర్‌కు బానిసై..

Thu,September 12, 2019 03:52 AM

Goldman Sachs VP swindles firm of rs 38 crore to repay poker debt in Bengaluru

- అప్పుల ఊబిలో గోల్డ్‌మన్ సాచ్స్ ఉపాధ్యక్షుడు
- కొట్టేసిన రూ.38 కోట్లు రికవరీ


బెంగళూరు, సెప్టెంబర్ 11: ఆన్‌లైన్ కార్డ్ గేమ్ పోకర్‌కు బానిసై.. అశ్విని జున్‌జున్‌వాలా దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గోల్డ్‌మన్ సాచ్స్ బెంగళూరు కార్యాలయంలో సెటిల్మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా 36 ఏండ్ల అశ్విని జున్‌జున్‌వాలా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన వ్యసనాల కారణంగా చేసిన వ్యక్తిగత అప్పులను తీర్చేందుకు రూ.38 కోట్ల (5.4 మిలియన్ డాలర్లు) సంస్థ సొమ్మును కొట్టేశాడు. తన కింది స్థాయి ఉద్యోగుల కంప్యూటర్ల నుంచి ఈ పనిని చక్కబెట్టిన జున్‌జున్‌వాలా.. ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. కాగా, రూ.38 కోట్లను తిరిగి రాబట్టామని బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు తెలిపారు. ఈ సొమ్మును చైనా బ్యాంక్‌లోని హాంకాంగ్‌కు చెందిన సినర్జీ విజ్డమ్ లిమిటెడ్ కంపెనీ ఖాతాకు పంపినట్లు తెలుస్తున్నది. తన మాజీ సహచర ఉద్యోగి వేదాంత్ రుంగ్టా (28) సలహాతో 5.4 మిలియన్ డాలర్ల కంపెనీ సొమ్మును హాంకాంగ్ కంపెనీ ఖాతాకు బదిలీ చేసేశాడు. వీరిరువురినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles