పసిడి మరింత పైకి

Tue,September 11, 2018 01:18 AM

Gold surges to Rs 31,550 on spot demand

- రూ.200 పెరిగిన తులం ధర
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఒకవైపు స్టాక్ మార్కెట్లు, రూపాయి పతనమవుతుంటే మరోవైపు అతి విలువైన లోహాల ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అన్యూహంగా డిమాండ్ నెలకొనడంతో ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.31,550 పలికింది. పండుగ సీజన్ కూడా ప్రారంభంకావడంతో దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని, మరోవైపు రూపాయి రికార్డు స్థాయిలో పతనమవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను లోహాలవైపు మళ్లించడంతో ధరలు ఎగబాకయాని ట్రేడర్ వెల్లడించారు. పసిడితోపాటు కిలో వెండి ధర రూ.175 ఎగబాకి రూ.37,950 వద్ద ముగిసింది.

2053
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles