బంగారం @ 33 వేలు

Thu,January 10, 2019 11:27 PM

Gold prices surpass Rs 33000

రూ.270 పెరిగిన తులం ధర
న్యూఢిల్లీ, జనవరి 10: బంగారం మళ్లీ భగ్గుమంటున్నది. వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర గురువారం ఏకంగా రూ.33 వేల మార్క్‌ను దాటింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.270 పెరిగి రూ.33,070 పలికింది. దేశవ్యాప్తంగా ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో అతి విలువైన లోహాల ధరలు ఎగువముఖం పట్టాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. వెండి మరింత పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో కిలో వెండి ధర రూ.410 పెరిగి రూ.40,510కి చేరుకున్నది. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,294.97 డాలర్లకు, వెండి 15.74 డాలర్లుగా నమోదైంది.

1996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles