కొనసాగుతున్న పసిడి పరుగు

Fri,August 23, 2019 12:17 AM

Gold prices hit new high

-రూ.39 వేలకు చేరువలో ధర
-రూ.150 ఎగబాకి రూ.38,970 తులం

న్యూఢిల్లీ, ఆగస్టు 22: రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధర గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమవడం, రూపాయికి మరిన్ని చిల్లులు పడటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో బంగారం ధర రూ.39 వేలకు చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర మరో రూ.150 అందుకొని రూ.38,970కి చేరుకున్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. మంగళవారం నుంచి రోజుకొక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నది. పసిడితోపాటు వెండి మరింత బలపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ధర రూ.60 పెరిగి రూ.45,100కి చేరుకున్నది. విదేశాల్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ లేకపోయినప్పటికీ దేశీయంగా ధరలు పెరుగడం విశేషమని ఆభరణాల వర్తకులు ఒకరు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లు పతనమవడం, రూపాయి ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయికి జారుకోవడం పసిడి పెరుగడానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,498.80 డాలర్ల వద్ద ఉండగా, వెండి 17.09 డాలర్లకు తగ్గింది. భవిష్యత్తు వడ్డీరేట్ల తగ్గింపుపై శుక్రవారం యూఎస్ ఫెడరల్ రిజర్వు చైర్‌పర్సన్ సమావేశం కావడం కూడా ధరలు పెరుగడానికి పరోక్షంగా కారణమయ్యాయి.

655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles