బంగారమాయేనా..!

Wed,August 21, 2019 04:55 AM

-రూ.200 పెరిగి రూ.38,770కి చేరిన తులం ధర..
-రూ.1,100 తగ్గిన కిలో వెండి

న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారం ధర మరో శిఖరాలకు చేరుకున్నది. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న అతి విలువైన లోహాల ధర మంగళవారం మరో చారిత్రక స్థాయి రూ.38,770కి చేరుకున్నాయి. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.200 అధికమైంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోయినప్పటికీ స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గకపోవడంతో రికార్డు స్థాయికి చేరుకున్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. వెండి కిలో ధర రూ.1,100 తగ్గి రూ. 43,900కి చేరుకున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లేకపోవడంతో వెండి భారీగా తగ్గిందని బులియన్ ట్రేడర్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా ధరలు పెరుగుతుండటం విశేషం. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమవడం బంగారం ధరలు పెరుగడానికి పరోక్షంగా కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,500 డాలర్లకు చేరువైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నట్లు జూలైలో జరిగిన ఫెడరల్ సమావేశం పూర్తి వివరాలు వెల్లడికావడంకావడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తగ్గుముఖం పట్టిందని, దీంతో తమ ఇన్వెస్ట్‌మెంట్లను అతి విలువైన లోహాలవైపు మళ్లించినట్లు జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ హరీష్ వీ తెలిపారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,496.60 డాలర్లకు, వెండి 16.93 డాలర్లకు చేరుకున్నది.

పెరిగిన పసిడి దిగుమతులు

పసిడి దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో భారత్ 13.16 బిలియన్ డాలర్ల(రూ.92 వేల కోట్లు) విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో చేసుకున్న 11.41 బిలియన్ డాలర్లతో పోలిస్తే 15.4 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాదికిగాను జీడీపీలో క్యాడ్ 57.2 బిలియన్ డాలర్లు లేదా 2.1 శాతంగా ఉన్నది. అంతక్రితం ఏడాదిలో 1.8 శాతంగా ఉన్నది. ఈ ఏడాది తొలి నెల జనవరి నుంచి పసిడి దిగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదవుతున్నది. ఒక ఫిబ్రవరిలో మాత్రం 11 శాతం తగ్గాయి. ప్రపంచ పసిడి వినిమయంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో ఆభరణాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతియేటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని డిమాండ్ చేసుకుంటున్నది. ఈ దిగుమతులను కట్టడి చేయడానికి ఈ ఏడాదికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచినప్పటికీ దిగుమతులు కట్టడి చేయడంలో విఫలమైంది.

837
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles