రూ.39 వేలపైకి మళ్లీ పసిడి

Thu,December 5, 2019 12:18 AM

-రూ.332 పెరిగిన తులం ధర

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: గత కొన్ని రోజులుగా దిగువముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి మళ్లీ రూ.39 వేల మార్క్‌ను దాటింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.332 అందుకొని రూ.39,299కి చేరుకున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో కిలో వెండి ఏకంగా రూ.676 అధికమై రూ.46,672 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌తోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో మరిం ప్రియమయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,483 డాలర్లకు చేరుకోగా, వెండి 17.27 డాలర్ల వద్ద ఉన్నది. అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు లేవని, నవంబర్ 2020 ఎన్నికల తర్వాతనే వచ్చే అవకాశం ఉన్నదని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఆందోళను పెంచింది.

308
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles