పరుగో.. పరుగు

Mon,April 16, 2018 01:18 AM

Gold Loses Rs 32000 Mark Silver Sheds Rs 250 5 Things To Know

-గ్రాముల పుత్తడి ధర రూ.32,000లపైనే
-అక్షయ తృతీయ వేళ రికార్డు స్థాయిలో బంగారం విలువ

1gold
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా వినియోగదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల ధర రూ.32,000 మార్కును అధిగమించగా, అక్షయ తృతీయ రోజున ఇంకెంతగా ఉంటుందోనన్న భయం.. పసిడి ప్రియులను వెంటాడుతున్నది. ఈ నెల 18 (బుధవారం)నే అక్షయ తృతీయ వస్తుండగా, ఈరోజు బంగారం తదితర విలువైన లోహాల కొనుగోళ్లు శుభప్రదమని అంతా భావిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఈ సంప్రదాయం కేవలం మొక్కుబడిగా సాగుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి కారణం గత ఎనిమిదేండ్లలో ఎప్పుడూ కూడా పుత్తడి ధర రూ.30,000లను మించలేదు మరి. కానీ ఈసారి ఏకంగా రూ.33,000 దిశగా పరుగులు పెడుతున్నది. అమెరికా, సిరియా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల ధర రూ.32,100గా నమోదైంది. అహ్మదాబాద్‌లోనైతే రూ.32,300లు పలికింది. ఇక 99.5 స్వచ్ఛత కలిగినది రూ.31,950గా ఉన్నది.
Traditiona
అక్షయ తృతీయ సమయంలో ఈ స్థాయి ధరలుండటం ఇదే. పన్నులతో కలుపుకుని నిరుడు రూ.28,861గానే ఉన్నది. 2016లో రూ.29,860కి చేరగా, 2010 నుంచి గమనిస్తే అక్షయ తృతీయ రోజున ఇదే అత్యధిక ధర. అయితే ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. అప్పటి కంటే ఇప్పుడు ధర రూ.2,500 వరకు ఎక్కువగా కదలాడుతున్నది. ధరలు ఇలాగే పెరుగుతూపోతే ఈసారి అక్షయ తృతీయే అత్యధిక రేటు పలికినదిగా చరిత్రలో నిలిచిపోతుంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో ఇప్పటికే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. సిరియా-అమెరికా మధ్య ఆందోళనకర పరిస్థితులు ఈ ధరలకు మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. సోమవారం మార్కెట్‌లో ధరలు ఇంకా పైకి చేరుతాయనిపిస్తున్నది అని భారతీయ బులియన్ సమాఖ్య కార్యదర్శి హరీశ్ ఆచార్య అన్నారు. ఈ ఏడాది బంగారం ధర రూ.28,500లతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ధరల్లో సుమారు రూ.4,000 వరకు పెరుగుదల చోటుచేసుకున్నది.

20 శాతం అమ్మకాలు పెరగొచ్చు!

ముంబై: మరోవైపు ఈసారి అమ్మకాల్లో 15-20 శాతం వృద్ధి ఉంటుందన్న విశ్వాసాన్ని ఆభరణాల వర్తకులు వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉందని, పెళ్లిళ్ళ సీజన్ కూడా కావడం కలిసొస్తున్నదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాదితో పోల్చితే 20 శాతం వరకు అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయన్న నమ్మకాన్ని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ ఇక్కడ పీటీఐ వద్ద వెలిబుచ్చారు. వజ్రాభరణాల కంటే బంగారు ఆభరణాలకే ఎక్కువగా డిమాండ్ ఉంటున్నదన్నారు. డబ్ల్యుహెచ్‌పీ జ్యుయెల్లర్స్ డైరెక్టర్ ఆదిత్యా పీథే సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు బాగుందని భారతీయ బులియన్, ఆభరణాల సంఘం (ఐబీజేఏ) ఉపాధ్యక్షుడు, పీఎన్ గాడ్గిల్ జ్యుయెల్లర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. నీరవ్ మోదీ కుంభకోణం తర్వాత మార్కెట్ మళ్లీ పుంజుకుంటున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే క్రిందటిసారితో చూస్తే తమ విక్రయాలు 5-10 శాతం పెరుగగలవన్న అంచనాను వ్యక్తం చేశారు. పెళ్లిళ్ళ సీజన్ కారణంగా నాణేలు, చిన్నచిన్న ఆభరణాలకు గిరాకీ బాగున్నదని, అక్షయ తృతీయ రోజున ఇచ్చేలా.. వివిధ ఆభరణాలను కస్టమర్లు ఆర్డర్‌పై తయారు చేయించుకుంటున్నారని వెల్లడించారు. ఇక ఈసారి అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉంటాయన్న ఆశాభావాన్ని కల్యాణ్ జ్యుయెల్లర్స్ సీఎండీ టీఎస్ కల్యాణరామన్ వ్యక్తం చేశారు.

1551
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS