పసిడికి పెండ్లి కళ

Thu,November 14, 2019 12:22 AM

-రూ.225 పెరిగిన తులం ధర

న్యూఢిల్లీ, నవంబర్‌ 13: దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర మరో రూ.225 అధికమై రూ.38,715 పలికింది. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు పుంజుకోవడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకులు తపన్‌ పటేల్‌ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమవడం కూడా ధరలు పెరుగడానికి పరోక్షంగా కారణమైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మద్దతు పలుకడంతో కిలో వెండి ధర రూ.440 అధికమై రూ.45,480 పలికింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,461 డాలర్లకు చేరుకోగా, వెండి 16.90 డాలర్లు పలికింది. వాణిజ్యంపై అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతున్నట్లు యూఎస్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో ధరలు పుంజుకున్నాయన్నారు.

381
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles