పసిడి జిగేల్..జిగేల్‌

Fri,July 12, 2019 02:51 AM

Gold climbs on positive global cues an uptick in spot demand

-ఒకేరోజు రూ.930 పెరిగిన ధర
-రూ.35,800కి చేరిన తులం

న్యూఢిల్లీ, జూలై 11: పసిడి రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఒకేరోజు రూ.930 పెరిగి రూ.35,800కి చేరుకున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి రూ.300 అందుకొని రూ.39,200గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో బంగారమైతే రూ.34,716 పలుకుగా, వెండి రూ.38 వేలకు చేరింది. హైదరాబాద్‌లో పసిడి రూ.34,340కి, వెండి రూ.38,400 పలికింది. వడ్డీరేట్లను త్వరలో తగ్గించనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వు చైర్మన్ పోవెల్ వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర వారం గరిష్ఠ స్థాయికి చేరుకున్నదని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హరీష్ తెలిపారు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటంతో గోల్డ్ ధరలు పెరుగడానికి పరోక్షంగా కారణమన్నారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,420.80 డాలర్లు పలుకగా, అదే వెండి 15.24 డాలర్లకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన నివేదిక ప్రకారం 99.9 శాతం, 99.5 శాతం కలిగిన బంగారం ధరలు రూ.930 ఎగబాకి రూ. 35,800కి, రూ.35,630కి చేరాయి. గ్లోబల్ మార్కెట్లకు తోడు స్థానిక ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా ధరలు పెరుగడానికి దోహదపడ్డాయని తెలిపింది.

4328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles