హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 350 కోట్లతో బిజినెస్ పార్క్

Sat,May 11, 2019 04:41 AM

GMR to invest Rs 350 crore on Business Park at Hyderabad airport

-ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జీఎంఆర్

హైదరాబాద్, మే 10: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎనిమిదో స్థానం దక్కించుకున్న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మరో వేదిక కాబోతున్నది. ఈ విమానాశ్రయ పరిధిలో ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ సిటీలో రూ.350 కోట్లతో బిజినెస్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు జీఎంఆర్ వర్గాలు ప్రకటించాయి. ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోతున్న ఈ బిజినెస్ పార్క్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు టవర్లను నెలకొల్పనున్నట్లు జీఎంఆర్ సీఈవో అమన్ కపూర్ ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే రెండు నుంచి రెండున్నరేండ్లలో ఈ బృహత్ ప్రాజెక్టు పూర్తికానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధులను కంపెనీ అంతర్గత వనరుల ద్వారా, బ్యాంకుల వద్ద రుణాలను తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ టవర్లలో కార్యాలయాలను ఏర్పాటు చేసే విషయంలోపలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు విడుతల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్‌ను 2.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పుతున్నది సంస్థ. 1,500 ఎకరాల స్థలంలో రియల్ ఎస్టేట్‌ను అభివృద్ధి పరుస్తున్న సంస్థ..వీటిలో హోటళ్లు, రిటైల్ స్థలం, లాజిస్టిక్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్, విద్య ఇనిస్టిట్యూట్‌లను ఏర్పాటు చేయడానికి చొరవ చూపిస్తున్నది.

2887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles