ఆగ్నేయాసియా, తూర్పు యూరప్ మార్కెట్లపై జీఎంఆర్ కన్ను


Wed,September 13, 2017 12:46 AM

gmr
హైదరాబాద్, సెప్టెంబర్ 12: మౌలిక వసతుల రంగానికి చెందిన జీఎంఆర్ గ్రూపు.. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్, తూర్పు యూరప్ మార్కెట్లో విమానాశ్రయ ప్రాజెక్టులను చేజిక్కించుకోవాలనుకుంటున్నది. దేశీయంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌తోపాటు రాజస్థాన్‌లోని జైపూర్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమానాశ్రయ (ఏరోడ్రోమ్స్) ప్రాజెక్టులపైనా కన్నేసింది. గ్రూపునకు చెందిన జీఎంఆర్ ఇన్‌ఫ్రా సంస్థ భారత్‌లోని హైదరాబాద్, ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు ఫిలిప్పీన్స్‌లోని మెక్టాన్ సెబూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను సైతం నిర్వహిస్తున్నది. మున్ముందు ఎయిర్‌పోర్టుల నిర్వహణే గ్రూపు వృద్ధి చోదకంగా మారనుంది. వ్యాపార వృద్ధి వ్యూహంలో భాగంగా దేశ, విదేశాల్లో ప్రాజెక్టులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాం అని వార్షిక నివేదికలో జీఎంఆర్ గ్రూపు పేర్కొంది.

319

More News

VIRAL NEWS