సీబీఆర్‌ఈలో 3 వేల ఉద్యోగాలు

Fri,March 15, 2019 12:30 AM

Global property consultant CBRE to hire 3000 employees in India

న్యూఢిల్లీ, మార్చి 14: అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ..భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి మరో 3 వేల మంది సిబ్బందిని ఈ ఏడాది నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గడిచిన సంవత్సరంలో దేశీయ ఆదాయం 20 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో పెరుగనున్నట్లు దేశీయ హెడ్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఇటీవల హౌజింగ్ బ్రోకరేజ్ విభాగంలోకి అడుగుపెట్టిన సంస్థ..ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ 8,300 మంది సిబ్బందితో పలు రకాల సేవలు అందిస్తున్నది. వీటిలో క్యాపిటల్ మార్కెట్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, కన్సల్టెంగ్, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సేవలు ఉన్నాయి. అనరాక్, ప్రాప్‌టైగర్, జేఎల్‌ఎల్ ఇండియా, క్విక్‌ఆర్, స్కైర్ యార్డ్స్, 360 రియల్టర్స్, ఇన్వెస్టర్ క్లినిక్, వెల్త్ క్లినిక్‌లకు పోటీగా సీబీఆర్‌ఈ సేవలు అందిస్తున్నది.

1655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles