ఉన్నత ప్రమాణాలతో రైల్వే సేవలు


Thu,December 7, 2017 12:17 AM

-రైల్వేబోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ
-సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సిబ్బందికి రూ.లక్ష నగదు అవార్డు
railway-services
అనంతరం రైల్ నిలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోహానీ మాట్లాడుతూ.. ఉత్తర, దక్షిణ భారతదేశ కార్యాచరణ పద్ధతులను సమన్వయం చేసుకుంటూ దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక గుర్తింపును నిలుపుకొంటున్నదని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత, సమయపాలన, రవాణాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనిచేసేచోట మహిళా ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే పనితీరు, సాధించిన ప్రగతిపై జీఎం వినోద్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. లోహానీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్లాట్‌ఫారాల నిర్వహణ, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, మంచినీటి సరఫరా వ్యవస్థ, సీసీ టీవీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అన్నింటి నిర్వహణ అద్భుతంగా ఉండటంతో అధికారులను అభినందించి, సిబ్బందికి రూ.లక్ష నగదు అవార్డును ప్రకటించారు. అనంతరం లోహానీ లాలాగూడలోని వర్క్‌షాప్‌ను సందర్శించారు.

283

More News

VIRAL NEWS