ఎగ్జిట్ బటన్ నొక్కుతున్న ఎఫ్‌పీఐలు

Mon,May 13, 2019 12:03 AM

FPLs  pressing the Exit button

-ఏడు ట్రేడింగ్ సెషన్లలో రూ.3,207 కోట్ల ఉపసంహరణ
న్యూఢిల్లీ, మే 12: వరుసగా మూడు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా నిధులు చొప్పించిన విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుతం ఉపసంహరణకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు జరిగిన ఏడు సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ.3,207 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం ఎఫ్‌పీఐల ఆందోళనను మరింత పెంచింది. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల(ఈక్విటీ, డెబిట్)లోకి ఏప్రిల్ నెలలో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మే 2 నుంచి 10 మధ్యకాలంలో నికరంగా ఈక్విటీల్లోకి రూ.1,344.72 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు..ఇదే సమయంలో డెబిట్ మార్కెట్ల నుంచి రూ.4,552.20 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంటే రూ.3,207.48 కోట్ల తరలించుకుపోయినట్లు తాజాగా డిపాజిటరీల వద్ద ఉన్న సమాచారం మేరకు తెలిసింది. ప్రస్తుత నెలలో స్వల్పకాలంపాటు పెట్టుబడులను ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలకు దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్‌మెంట్లకు భారతే కీలకమని బజాజ్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ అగర్వాల్ తెలిపారు. పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో గడిచిన మూడు నెలలుగా ఎఫ్‌పీఐలు భారీగా నిధులు కుమ్మరించారని, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో నిధుల లభ్యత అధికమవడం ఇందుకు దోహదం చేశాయన్నారు.

605
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles