ఆగని ఎఫ్‌ఐఐల అమ్మకాలు

Mon,January 21, 2019 12:45 AM

-రూ. 4,040 కోట్ల విరమణ

న్యూఢిల్లీ, జనవరి 20: దేశీయ క్యాపిటల్ మార్కెట్లనుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈనెలలో ఇప్పటివరకు రూ. మొత్తం రూ. 4,040 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపు రూ.17,000 కోట్ల పెట్టుబడులను నికరంగా పెట్టిన ఎఫ్‌ఐఐలు ఈ నెలలో మాత్రమే అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈక్విటీల నుంచి ఈ నెలలో మొత్తం రూ. 3,987 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోగా, రుణ మార్కెట్ల నుంచి మరో రూ. 53 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం రూ. 4,040 కోట్ల పెట్టుబడులను జనవరి 1 - 18 తేదీల మధ్య విరమించుకున్నట్టు అయింది. ఎఫ్‌ఐఐలు ఇప్పటికీ కొత్త పెట్టుబడులపై వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో రెండు వారాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున విధానపర నిర్ణయాలపై వేచి చూస్తున్నారు.

475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles