ఫోర్డ్ మిడ్‌నైట్ సర్‌ప్రైజ్ ఆఫర్లు

Thu,December 6, 2018 12:48 AM

Ford Midnight Surprise 2018 edition Ford Figo prizes worth Rs 11 crore on offer

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రముఖ కార్ల విక్రయ సంస్థ ఫోర్డ్ ఇండియా.. ఈ నెల 7 నుంచి 9 వరకు తమ కార్లను బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రూ.11 కోట్ల విలువైన బహుమతులు అందిస్తున్నట్లు ప్రకటించింది. గృహోపకరణాలు, బంగారు నాణేలు, ఐఫోన్ ఎక్స్, హై-ఎండ్ ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు, హోమ్ థియేటర్ సిస్టమ్, మైక్రోవేవ్స్‌తోపాటు ఏడు రోజులపాటు ప్యారిస్ పర్యటనను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. బుకింగ్‌ల కోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యరాత్రి వరకు కంపెనీకి చెందిన షోరూంలు తెరిచివుంచనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. బంపర్ బహుమతి కింద అందిస్తున్న ఫోర్డ్ ఫిగో కారు విజేతను జనవరి 22, 2019న సంస్థ ప్రకటించనున్నది.

592
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles