ఫ్లిప్‌కార్ట్ @ నం.3


Sat,August 12, 2017 11:58 PM

flipkart
బెంగళూరు, ఆగస్టు 12: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ప్రపంచంలో అత్యధిక ఫండింగ్ పొందిన మూడో ప్రైవేట్ సంస్థగా అవతరించింది. ఇప్పటివరకు సంస్థ 700 కోట్ల డాలర్ల నిధులు సేకరించగలిగింది. జపాన్‌కు చెందిన టెక్నాలజీ, టెలికం దిగ్గజ గ్రూపు సాఫ్ట్‌బ్యాంక్ నుంచి ఫ్లిప్‌కార్ట్ తాజాగా 240 కోట్ల డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. దాంతో కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా సాఫ్ట్‌బ్యాంక్ ఎదిగింది. అత్యధిక ఫండింగ్ రాబట్టిన స్టార్టప్‌లలో అంతర్జాతీయ ఆన్‌లైన్ ట్యాక్సీ సేవల సంస్థలు దీదీ చిక్సింగ్, ఉబెర్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చైనాకు చెందిన దీదీ చిక్సింగ్.. ఏప్రిల్‌లో 500 కోట్ల డాలర్లు సేకరించింది. దాంతో సంస్థలోకి ఇప్పటివరకు వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ 1,500 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికన్ స్టార్టప్ ఉబెర్‌లోకి ఇప్పటివరకు 1,290 కోట్ల నిధులు ప్రవహించాయి. అత్యధికంగా నిధులు ఆకర్షించిన టాప్ టెన్ కంపెనీల్లో నాలుగు ఆన్‌లైన్ ట్యాక్సీ సేవలందించేవే. దీదీ, ఉబెర్‌తోపాటు సిలికాన్ వ్యాలీకి చెందిన లిఫ్ట్, భారత సంస్థ ఓలాకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. ఇక ఫ్లిప్‌కార్ట్..టాప్‌టెన్‌లోని ఏకైక ఈ-కామర్స్ సంస్థ.

168

More News

VIRAL NEWS