విమాన చార్జీలకు రెక్కలు!

Thu,September 12, 2019 03:50 AM

Flight ticket hiked

- ఈ ఏడాది 9 శాతం వరకు పెరిగే అవకాశం

ముంబై, సెప్టెంబర్ 11: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయంగా విమాన టిక్కెట్ల ధరలు 7 శాతం నుంచి 9 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసర్చ్ వెల్లడించింది. ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్‌తో టిక్కెట్టు ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. ఈ ఏడాది ప్రయాణికుల్లో వృద్ధి 6 శాతం నుంచి 8 శాతం మధ్యలో ఉంటుందని అంచనావేస్తున్నది క్రిసిల్. గతేడాది నమోదైన 19 శాతం వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2013 తర్వాత విమాన టిక్కెట్ల ధరల పెరుగుదలలో ఇదే గరిష్ఠ స్థాయి అని పేర్కొంది. అప్పట్లో మాల్యాకు చెంది న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే. బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ రెండు విమానాలు కూలిపోవడంతో మార్చి నుంచి ఈ విమాన సర్వీసులు నేలపట్టునే ఉండటం, విమాన ప్రయాణికుల వృద్ధి 80-100 బీపీఎస్‌లగా ఉంటుందని అంచనావేస్తున్నది. జెట్ ఎయిర్‌వేస్ మూతపడటంతో తన పోటీ సంస్థలైన స్పైస్‌జెట్, ఇండిగోలు దూసుకుపోవడంతో ఈ ఏడాది ప్రయాణికుల్లో వృద్ధి రెండంకెల స్థాయిలో ఉంటుందని తెలిపింది.

193
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles