హైదరాబాద్‌లో మరో ఐదు డాష్ స్కైర్ స్టోర్లు

Wed,August 15, 2018 12:31 AM

Five more dash ski stores in Hyderabad

హైదరాబాద్, ఆగస్టు 14: అమెరికాకు చెందిన ప్రముఖ ఫర్నిచర్ ఉత్పత్తుల విక్రయ సంస్థ డాష్ స్కైర్ రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే బెంగళూరు, పుణెలలో స్టోర్లను ఏర్పాటు చేసిన సంస్థ తాజాగా హైదరాబాద్‌లో తన తొలి స్టోర్‌ను మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ పార్టనర్ అమృత్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ఫర్నిచర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాదిలోగా మరో 5 నుంచి ఆరు స్టోర్ల వరకు ఇక్కడే ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ స్టోర్‌లో రూ.200 మొదలుకొని రూ.5 లక్షల వరకు పలు రకాల ఫర్నిచర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిని వియత్నం నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తున్నట్లు, మార్కెట్ అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటే ఇక్కడే ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.

355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS