బాధగా ఉంది: నరేశ్ గోయల్

Fri,August 10, 2018 12:42 AM

Feeling embarrassed about investors losing money

ముంబై, ఆగస్టు 9 : షేర్‌హోల్డర్లు నష్టపోతుంటే తాను అపరాధ భావనతో కుమిలిపోతున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేశ్ గోయల్ తెలిపారు. తీవ్ర ఆర్థిక కష్టాలతో నడుస్తున్న జెట్ ఎయిర్‌వేస్ షేర్ 52వారాల కనీస స్థాయి రూ.286.95కి పతనమైంది. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానయాన రంగంలో పోటీతోపాటు ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కంపెనీపై పడిందన్నారు. ఈ ఏడాది జనవరి 5న షేర్ విలువ రూ.883.65గా ఉండటం గమనార్హం. కాగా, ఇంజినీరింగ్, ైఫ్లెట్ కార్యకలాపాలపై ఎయిర్‌ఇండియా సహకారం కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించారు. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర కోలుకుని 3.11 శాతం లాభంతో రూ.303.35 వద్ద ముగిసింది.

396

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles