మార్కెట్లకు ఫెడ్ కిక్కు

Fri,July 12, 2019 02:39 AM

Fed rate cut would kick start growth market bull Tony Dwyer says

266 పాయింట్లు లాభపడిన సూచీగూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు
ముంబై, జూలై 11: బడ్జెట్ దెబ్బకు గడిచిన కొన్నిరోజులుగా దిగువముఖం పట్టిన దేశీయ మార్కెట్లు నెలకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకున్నాయి. వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందన్న అమెరికా ఫెడరల్ రిజర్వు చీఫ్ జెరోమ్ పోవెల్ వ్యాఖ్యలు మార్కెట్లుకు మరింత కిక్కునిచ్చాయి. ప్రారంభం నుంచే లాభాల బాట పట్టిన సూచీలు ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంట్రాడేలో 335 పాయింట్లు లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు 266.07 పాయింట్లు ఎగబాకి 38,834.11 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ మరో 84 పాయింట్లు అందుకొని 11, 582.90 వద్ద స్థిరపడింది. మసకబారుతున్న అమెరికా వృద్ధికి ఊతమివ్వడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పోవెల్ వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఫలితంగా దేశీయ సూచీలు కూడా భారీగా పుంజుకున్నాయి.

మార్కెట్లో ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ 4.46 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటర్స్, వేదాంతా, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల షేర్లు 3.63 శాతం వరకు బలపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, యెస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీలు ఒక్క శాతంకు పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్లకు ఆక్సిజన్‌లా పనిచేశాయని, దేశీయ మార్కెట్లు అరశాతానికి పైగా లాభపడ్డాయని శ్యాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అధికారి సునీల్ శర్మ తెలిపారు. వడ్డీరేట్ల తగ్గింపుతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యలభ్యత పరిస్థితులు మెరుగుపడనుండటం మదుపరులకు కలిసొచ్చిందన్నారు. రంగాల వారీగా చూస్తే ఆటో, మెటల్, టెలికం, రియల్టీ, యుటిలిటీ, ఫైనాన్స్ రంగ షేర్లకు మదుపరుల నుంచి వచ్చిన మద్దతుతో 1.84 శాతం లాభపడగా, క్యాపిటల్ మాత్రం నష్టపోయాయి.14 పైసులు లాభపడ్డ రూపాయి ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలు అమెరికా కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా ఇతర కరెన్సీలు లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు పెరిగి 68.44 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరిగినప్పటికీ రూపాయి బలపడటం విశేషమని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 68.31 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 68.30 నుంచి 68.48 మధ్యలో కదలాడింది.

452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles