325 లక్షల కోట్లు

Wed,November 15, 2017 12:31 AM

Farm credit to cross target of Rs 3.75 lakh crore this fiscal

భారతీయ గృహస్తుల సంపద
2.45 లక్షల మిలియనీర్లు: క్రెడిట్ స్యూస్
wealth
న్యూఢిల్లీ, నవంబర్ 14: దేశంలో మిలియనీర్లు 2,45,000 మంది ఉన్నారని, మొత్తం గృహస్తుల సంపద 5 లక్షల కోట్ల డాలర్లు (డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం రూ.325 లక్షల కోట్లు)గా ఉందని క్రెడిట్ స్యూస్ గ్లోబల్ వెల్త్ రిపోర్టు తెలిపింది. 2022 నాటికి మిలియనీర్లు 3,72,000లకు చేరనున్నారని చెప్పిన క్రెడిట్ సూస్.. గృహస్తుల సంపద 7.5 శాతం వార్షిక వృద్ధిరేటుతో 7.1 లక్షల కోట్ల డాలర్లను తాకుతుందని అంచనా వేసింది. 2000 సంవత్సరం నుంచి భారత్‌లో సంపద యేటా 9.9 శాతం పెరుగుతున్నదని, ప్రపంచ సగటు వృద్ధిరేటు 6 శాతం కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఇక సంపద వృద్ధిలో ప్రపంచ స్థాయిలో భారత్ 8వ అతిపెద్ద దేశంగా ఉందన్న క్రెడిట్ స్యూస్.. వయోజన జనాభాలో 92 శాతం మంది సంపద 10,000 డాలర్లకు దిగువనే ఉన్నదని స్పష్టం చేసింది. కేవలం 0.5 శాతం మంది నికర సంపదే లక్ష డాలర్లను మించి ఉందని ప్రకటించింది.

అలాగే 50 మిలియన్ డాలర్లకుపైగా సంపదను కలిగి ఉన్న వయోజనులు 1,820 మంది అని, 100 మిలియన్ డాలర్లకుపైగా సంపద ఉన్నవారు 760 అని వివరించింది. దేశీయ వ్యక్తిగత సంపదలో స్థిరాస్తులు, ఇతరత్రా నిర్మాణ రంగ ఆస్తుల వాటానే అధికమని, గృహస్తుల ఆస్తుల్లో 86 శాతం ఇవే ఉన్నాయని ఈ సందర్భంగా క్రెడిట్ స్యూస్ తెలియజేసింది. కాగా, స్థూల ఆస్తుల్లో వ్యక్తిగత రుణాలు 9 శాతం మాత్రమేనని, అభివృద్ధి చెందిన చాలా దేశాల కంటే ఇది తక్కువని వెల్లడించింది. స్టాక్ మార్కెట్లతోపాటు నాన్-ఫైనాన్షియల్ ఆస్తుల్లో విపరీతంగా వచ్చిన లాభాల వల్లే ప్రపంచ సంపద గరిష్ఠ స్థాయి వృద్ధిని అందుకోగలిగిందని విశ్లేషించింది. గడిచిన ఏడాది కాలంలో భారత్‌సహా చాలా దేశాల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 30 శాతం పెరిగిందని, ఇండ్ల ధరలు సుమారు 10 శాతం ఎగిశాయని తెలిపింది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ కూడా 4 శాతం పెరిగినట్లు చెప్పింది. ఇకపోతే ఈ ఏడాది వయోజనుల సంపదలో 5,37,600 డాలర్ల సగటుతో స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఉండగా, 4,02,600 డాలర్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 3,88,000 డాలర్లతో అమెరికా మూడో స్థానంలో ఉందని క్రెడిట్ స్యూస్ తమ తాజా నివేదికలో తెలిపింది.

5044
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS