Telangana Intermediate 1st & 2nd Year Results 2019

గూగుల్‌పై భారీ జరిమానా

Thu,March 21, 2019 01:37 AM

EU hits Google with 1.68 bn fine for abusing online ads market

-రూ.11,623 కోట్లు విధించిన ఈయూ
-ఆన్‌లైన్ ప్రకటనల్లో గుత్తాధిపత్య కుట్ర
బ్రస్సెల్స్, మార్చి 20: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌పై యూరోపియన్ యూనియన్ (ఈ యూ) రెగ్యులేటర్లు భారీ జరిమానా విధించారు. ఏకంగా రూ.11,623 కోట్ల (1.68 బిలియన్ డాలర్లు) ఫైన్ వేశారు. ఆన్‌లైన్ ప్రకటనల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకే ఈ జరిమానా పడింది. ఈ మేరకు ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. ప్రకటనల్లో గూగుల్ గుత్తాధిపత్యం ఆరోపణలపై చేసిన సుదీర్ఘ విచారణలో భాగంగానే ఈ జరిమానా వేసినట్లు చెప్పారు. కాగా, గూగుల్‌పై ఈ విధంగా ఈయూ అవిశ్వాస జరిమానాలను వేయడం ఇది మూడోసారి. బ్రోకర్ల ద్వారా వెబ్‌సైట్లను అడ్డుకుంటూ గూగుల్ ప్రకటనల ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నించినట్లు వెస్టాగర్ అన్నారు.

ఈ క్రమంలోనే గూగుల్, దాని మాతృ సంస్థ అల్ఫాబెట్.. ఈయూ యాంటీట్రస్ట్ నియమాలను ఉల్లంఘించాయని పేర్కొన్నారు. గూగుల్ తమ యాడ్‌సెన్స్ వేదికను దుర్వినియోగం చేస్తూ ఇతర పోటీ సంస్థలకు అవకాశం లేకుండా కుట్రతో వ్యవహరించిందని వివరించారు. దీనివల్ల వినియోగదారులపై భారం పడుతున్నదని, ఇతర సంస్థల ప్రకటనల వ్యయం పెరుగుతున్నదని, కొన్ని సంస్థలకే లాభాలు వచ్చేలా గూగుల్ ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ ఫిర్యాదు నేపథ్యంలో 2016లో విచారణ ప్రారంభించిన ఈయూ.. తాజాగా ఈ జరిమానా విధించింది. గతంలోనూ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కేసులో 5 బిలియన్ డాలర్లు, మరో కేసులో 3 బిలియన్ డాలర్ల మేర జరిమానాల్ని గూగుల్‌పై ఈయూ విధించింది.

2225
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles