జీ నుంచి వైదొలగనున్న సుభాష్ చంద్ర

Fri,November 22, 2019 12:27 AM

- 16.5 శాతం వాటా విక్రయించేయోచనలో ప్రమోటర్
ముంబై, నవంబర్ 21: ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీఈఈఎల్)లో సుభాష్ చంద్ర ప్రస్థానం ఇక ముగియబోతున్నది. పాతికేళ్ల క్రితం చిన్నస్థాయి మీడియా సంస్థను ప్రారంభించి అంచెలంచెలుగా ఈ కంపెనీని ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన చంద్ర..జీలో తనకున్న వాటాలో 16.5 శాతం వాటాను విక్రయించడానికి సిద్ధమయ్యారు. ఈ వాటా విక్రయ అనంతరం చంద్ర వాటా 5 శా తానికి తగ్గనున్నది. దీంతో జీ నాయకత్వ బాధ్యతల నుంచి ఆ యన తప్పుకోవాల్సి న పరిస్థితి ఏర్పడనున్నది. టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జీ..ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది.


ప్యాకేజింగ్, మౌలి క సదుపాయాలు, విద్యా, ఆర్థికం, టెక్నాలజీ రంగాలకు విస్తరించింది. అంతకుముందు ఈ ఏడాది తొలి నెలల్లో ఎస్సెల్ గ్రూపు..జీలో 11 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.4,224 కోట్ల నిధులు వెచ్చించింది. ఇప్పటికే ఎస్సెల్ గ్రూపు.. జీలో 22.37 శాతం వాటాను చేజిక్కించుకున్నది. ఈ వాటా విక్రయవార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేరు ధర భారీగా పుంజుకున్నది. ఇంట్రాడేలో 14.99 శాతం ఎగబాకిన షేరు ధర మార్కెట్ ముగిసే సమయానికి 12.40 శాతం లాభంతో రూ.345. 25 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 11.72 శాతం అధికమై రూ.343 వద్ద స్థిరపడింది.

264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles