3న హాజరవ్వాలి

Wed,April 24, 2019 12:06 AM

ED summons Chanda Kochhar on May 3

-చందా కొచ్చర్‌కు ఈడీ సమన్లు..
-దీపక్, రాజీవ్ కొచ్చర్లకూ జారీ
-ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసులో వచ్చే వారం విచారణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. దీపక్ సోదరుడు రాజీవ్ కొచ్చర్‌కూ నోటీసు ఇచ్చింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ గత వారమే ఈ సమన్లను పంపగా, చందా కొచ్చర్ మే 3న, దీపక్, రాజీవ్ కొచ్చర్లు ఈ నెల 30న తమ ఎదుట హాజరు కావాలని అందులో ఈడీ ఆదేశించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసును నమోదు చేసిన ఈడీ.. లోతైన విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొచ్చర్లను అధికారులు సుదీర్ఘంగా విచారించగా, ఇప్పుడు మరో దఫా విచారణ జరుపనున్నారు. మార్చి 1న ముంబైలోని ఈడీ ఆఫీసులో కొచ్చర్లతోపాటు వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్‌నూ అధికారులు ప్రశ్నించిన సంగతి విదితమే. కాగా, వ్యక్తిగత, అధికారిక ఆర్థిక సంబంధిత డాక్యుమెంట్లను తీసుకురావాలని ఈ సందర్భంగా తాజా సమన్లలో ఈడీ సూచించింది. వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు రుణాలివ్వడంలో స్వప్రయోజనాలకు చందా కొచ్చర్ పెద్దపీట వేశారని, రూ.1,875 కోట్ల రుణాల మంజూరులో కొచ్చర్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.

2193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles