భవిష్యత్ సవాలే..

Sat,December 19, 2015 06:00 AM

Economy Showing Mixed Signals, Outlook Challenging:Arvind Subramanian

-ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ సంకేతాలు
-ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు
అరవింద్ సుబ్రమణియన్

భారత ఆర్థిక వ్యవస్థ నుంచి మిశ్రమ సంకేతాలొస్తున్నాయని ఆర్థిక నివేదిక రూపకర్త, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులింకా బలహీనంగానే ఉండటంతోపాటు ప్రభుత్వ వ్యయం భారీగా పెరగనున్న నేపథ్యంలో భవిష్యత్ ముఖచిత్రం మాత్రం సవాలుగానే కన్పిస్తున్నదని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు సమృద్ధిగా, నిలకడగానే కన్పిస్తున్నాయని అన్నారు.

Arvind-Subramanian

జీడీపీ అంచనాలను భారీగా తగ్గించినప్పటికీ.. ప్రపంచంలో అందరికంటే శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశం ఇండియానే అని ఆర్థిక నివేదిక విడుదల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబ్రమణియన్ పేర్కొన్నారు. భారత్ స్థిరత్వంలో స్వర్గధామమని, అవకాశాలకు గడికావలి వంటిదన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ బాట పట్టినప్పటికీ భవిష్యత్‌లో ఏ స్థాయిలో, ఏ మేరకు అభివృద్ధి చెందనుందన్న విషయంపై స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో సంకేతాలు మిశ్రమంగా ఉండటంతోపాటు జీడీపీని అవగతం చేసుకొనే విషయంలో కొంత అనిశ్చితినెలకొనడం ఇందుకు కారణమని సుబ్రమణియన్ చెప్పారు. ఒక్కో రంగ పరిస్థితి ఒక్కోలా ఉందని, దీంతో మొత్తంగా స్థితిగతులను అవగతం చేసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. దేశీయ కరెన్సీ నిలకడ సాధించిందని సుబ్రమణియన్ అన్నారు. డాలర్-రూపాయి మారకం రేటు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిస్తుందని.. ఇతర దేశాల కరెన్సీలన్నింటితో పోల్చి చూస్తే సరైన అవగాహనకు రావచ్చన్నారు. వచ్చే ఏడాది ఎగుమతులు పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసిన సుబ్రమణియన్.. 2016-17లో కరెంట్ ఖాతా లోటు 1-1.2 శాతం మధ్యలో ఉండొచ్చని అంచనా వేశారు.

910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles