భాగ్యనగరంలో హౌజింగ్ బూమ్

Mon,October 15, 2018 02:58 AM

During the January to September period sales grew by 12 percent

-జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో 12 శాతం పెరిగిన అమ్మకాలు..
-వచ్చే మూడు నెలల్లో మరింత పెరిగే అవకాశం
-వెంటనే గృహప్రవేశం చేయదగిన ఇండ్లపైనే ఆసక్తి..
-పాత ప్రాజెక్టులను పూర్తి చేయడానికే బిల్డర్ల యత్నం

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో (జనవరి-సెప్టెంబర్) ఏడు ప్రధాన నగరాల్లో నివాసగృహాల అమ్మకాలు ఎనిమిది శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాల్లో అమ్మకాలు పుంజుకున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టంట్స్ పేర్కొంది. కాగా, ఈ ఏడు నగరాల్లో జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో హౌజింగ్ అమ్మకాలు 15శాతం పెరిగాయి. డీమానిటైజేషన్, జీఎస్టీ, రెరా వంటి విధాన నిర్ణయాలతో కుంటుపడిన హౌజింగ్ అమ్మకాలు ఈ ఏడాది వివిధ సానుకూల ఆర్థికాంశాల కారణంగా పుంజుకున్నాయని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరీ తెలిపారు. రెరా, జీఎస్టీ చట్టాల అమలు ప్రారంభంలో ఎదురైన బాలారిష్టాలు తొలగిపోవడంతో కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగుపడిందన్నారు. జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు 12 శాతం మేర పెరిగాయని అనరాక్ నివేదిక తెలిపింది.

కాగా, బెంగళూరు అన్ని నగరాల కన్నా అధికంగా 30 శాతం మేర హౌజింగ్ అమ్మకాలు జరిగాయి. ఆ తరవాత కోల్‌కతాలో 12 శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 7 శాతం, ముంబైలో4 శాతం పెరిగాయి. వచ్చే మూడు నెలల కాలంలో పండుగల సీజన్ కారణంగా ఇండ్ల అమ్మకాలు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు అనుజ్ పూరీ తెలిపారు. డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను చేపట్టడం కన్నా, ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఆసక్త చూపుతున్నారని ఆయన చెప్పారు. కాగా, వినియోగదారుల్లో 49 శాతం మంది వెంటనే గృహ ప్రవేశాలు చేయడానికి వీలున్న ప్రాజెక్టులనే ఎంచుకుంటుండగా, 5 శాతం మంది కొత్త ప్రాజెక్టుల్లోనూ, 46 శాతం ఏడాదిలోగా పూర్తయ్యే ప్రాజెక్టుల్లో ఇండ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తమ సర్వేలో వెల్లడైనట్టు ఆయన వెల్లడించారు.

2790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles