ఐడీఆర్బీటీలో 5జీ యూస్ కేసెస్ ల్యాబ్

Sat,April 13, 2019 02:21 AM

DRBT launches 5G Use Cases Lab

-ప్రారంభించిన కేంద్ర టెలికమ్యునికేషన్ సంయుక్త కార్యదర్శి అమిత్ యాదవ్
అహ్మద్‌నగర్,ఏప్రిల్ 12: ప్రభుత్వ బ్యాంకింగ్, ఆర్థిక రంగాలలో నాణ్యమైన ఇంటర్నెట్ సేవల వినియోగానికి కేంద్ర ఆర్థిక, సమాచార మంత్రిత్వ శాఖలు శ్రీకారం చుడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఐడీఆర్బీటీ బ్యాంకింగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంటెస్ట్ కేంద్రంగా 5జీ సేవలకు నాంది పలికారు. నగరంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ)లో 5జీ యూజ్ కేసెస్ ల్యాబ్‌ను కేంద్ర టెలికమ్యునికేషన్ సంయుక్త కార్యదర్శి అమిత్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్యాంకులు పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) మెచిన్లను అడ్వాన్స్ టెక్నాలజీతో అనుసంధానం చేయాలని, ముఖ్యంగా 2జీకి బదులుగా 3జీ లేదా 4జీని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 5జీ సేవలు బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లోనే కాక ఐటీ రంగంతో పాటు ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటా వినియోగదారులున్న భారత్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుందని పేర్కొన్నారు. గడిచిన మూడేండ్లలో దేశవ్యాప్తంగా 5 లక్షల టవర్లను ఏర్పాటు చేశాయని, మరో 2 లక్షల బేస్ స్టేషన్లను నెలకొల్పాయన్నారు. దేశంలో 5జీ సేవలను విస్తృతం చేసే చర్యల్లో భాగంగా వైట్ పేపర్ ఆన్ 5జీ అప్లికేషన్స్ పుస్తకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అంజనా దూబేతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర టెలికమ్యునికేషన్ల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్ పాతక్, కేంద్ర టీఎస్‌డీఎస్ డైరెక్టర్ జనరల్ పమేలా కుమార్, ఐడీఆర్బీటీ డైరెక్టర్ డాక్టర్ ఏఎస్ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

300
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles