డాక్టర్ రెడ్డీస్ చేతికి 42 ఏఎన్‌డీఏల పోర్ట్‌ఫోలియో

Sun,April 14, 2019 02:29 AM

Dr Reddys Acquires A Portfolio Of 42 ANDAs In U S

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. అమెరికాలో 42 అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ల (ఏఎన్‌డీఏ) పోర్ట్‌ఫోలియోను చేజిక్కించుకున్నది. అయితే ఏఎన్‌డీఏల మార్కెటింగ్ పోర్ట్‌ఫోలియోను ఇంకా దక్కించుకోవాల్సి ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందని శనివారం తెలియజేసింది. ఈ ఏఎన్‌డీఏల్లో 30కిపైగా జనరిక్ ఇంజెక్టబుల్ ఉత్పత్తులూ ఉన్నాయి. కాగా, ఈ ఉత్పత్తుల సాంకేతికత బదిలీ అవసరమన్న సంస్థ.. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో వీటిని ప్రారంభిస్తామని తెలిపింది. గతేడాది అమెరికాలో ఈ 42 ఏఎన్‌డీఏల మార్కెట్ విలువ దాదాపు 645 మిలియన్ డాలర్లుగా ఉన్నది.

931
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles