ట్రంప్ దూకుడు చైనాపై మరిన్ని సుంకాలు

Sun,May 12, 2019 12:03 AM

Donald Trump orders raising tariffs on essentially all remaining imports from China

వాషింగ్టన్/బీజింగ్, మే 11: ట్రంప్ దూకుడుతో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నది. అమెరికాలోకి చైనా నుంచి దిగుమతి అవుతున్న 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తూత్పత్తులపై 10 శాతంగా ఉన్న సుంకాలను శుక్రవా రం నుంచి 25 శాతానికి ట్రంప్ పెం చిన విషయం తెలిసిందే. ఈ క్రమం లో చైనా నుంచి వస్తున్న దాదాపు అన్ని వస్తూత్పత్తులపై సుంకాలు వేయాలని ట్రంప్ నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ మేరకు ఆదేశాలనూ ఇచ్చేశారు మరి. ఓవైపు అమెరికాతో సంప్రదింపులు ఇంకా ముగియలేదని చైనా చెబుతున్నా.. ఇటీవల విఫలమైన చర్చలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ మా త్రం వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆం దోళనకు గురిచేస్తున్నది. కాగా, తాజా నిర్ణయంతో అదనంగా సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ప్రభావం పడనున్నది. మరోవైపు చైనా సైతం ప్రతీకార సుంకాలకు దిగే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే అమెరికా-చై నా సుంకాల పోరు.. ప్రపంచ దేశాలను, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

1114
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles