డీ-మార్ట్ లాభంలో స్వల్ప వృద్ధి

Sat,January 12, 2019 11:50 PM

DMart Net Profit Growth Slowest In Eight Quarters

న్యూఢిల్లీ, జనవరి 12: డీ-మార్ట్ పేరుతో రిటైల్ విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలానికి సంస్థ రూ.257 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.252 కోట్ల లాభంతో పోలిస్తే 2.1 శాతం పెరిగిందని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో నిర్వహణ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 33.2 శాతం పెరిగి రూ.5,451 కోట్లకు చేరుకున్నది. ప్రతి షేరుపై రూ.4.12 ఆర్జించినట్లు అయింది. గడిచిన త్రైమాసికంలో కేవలం నాలుగు స్టోర్లను మాత్రమే సంస్థ ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లీ నోరోన్హా మాట్లాడుతూ..ఫలితాలు అంచనావేసిన స్థాయిలోనే నమోదయ్యాయని, పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ గతేడాదితో పోలిస్తే మెరుగ్గానే ఉన్నదని, పలు వస్తువుల ధరలను తగ్గించడంతో మార్జిన్లపై ప్రభావం చూపాయన్నారు. డిసెంబర్ చివరినాటికి సంస్థ 164 రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసింది.

1461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles