నా భర్త వ్యాపారాల గురించి తెలియదు

Thu,March 14, 2019 01:01 AM

Didn t know of husband business dealings says Chanda Kochhar to ED

-ఈడీ అడిగిన ప్రశ్నలకు చందా కొచ్చర్ సమాధానం
న్యూఢిల్లీ, మార్చి 13: వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రుణాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ నుంచి పలు విషయాలను రాబట్టింది. గడిచిన వారంలో నాలుగు రోజులపాటు విచారించిన ఈడీ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. ఈడీ వర్గాలు అడిగిన ప్రశ్నకు కొచ్చర్ సమాధానమిస్తూ.. వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేస సమయానికి తన భర్త దీపక్ కొచ్చర్‌కు, ఆ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లకు మధ్య ఉన్న వ్యాపార లావాదేవీల గురించి తనకు తెలియదన్నారు. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.300 కోట్ల రుణాన్ని ఇచ్చిన మరుసటి రోజే కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన నూపవర్ రెన్యూవబుల్ ఎనర్జీకి వీడియోకాన్ గ్రూపు రూ.64 కోట్ల రుణాన్ని మంజూరు చేసిన విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చందాకొచ్చర్‌ను ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన కొచ్చర్.. బ్యాంక్ కార్యకలాపాల గురించి నా భర్తతో చర్చించను..దీంతో రుణం మంజూరు చేసినందుకు ప్రతిఫలం తీసుకున్నామనడానికి ఆస్కారం లేదు. రుణ మంజూరు కమిటీ అర్హతను పరీక్షించిన తర్వాతనే వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరు చేశాము అని పేర్కొన్నారు. చందా కొచ్చర్, ఆమె భర్త చెప్పిన సమాధానాలపై అసంతృప్తిని వ్యక్తంచేసిన ఈడీ... వారిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసును జారీ చేసింది కూడా. జూన్ 2009 నుంచి అక్టోబర్ 2011 మధ్యకాలంలో ఐసీఐసీఐ బ్యాంక్..వీడియోకాన్ గ్రూపునకు ఆరు విడుతల్లో రూ.1,875 కోట్ల రుణాన్ని అందించింది. వీటిలో 84 శాతం నిరర్థక ఆస్తులుగా గుర్తించింది.

3757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles