జన్‌ధన్ ఖాతాల్లోరూ.90 వేల కోట్ల డిపాజిట్లు!

Mon,February 11, 2019 12:39 AM

Deposits in Jan Dhan accounts set to cross Rs 90,000 crore

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రతి ఇంటికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్ ప్రారంభించిన జన్‌ధన్ యోజన పథకం బ్యాంకుల్లో డిపాజిట్లు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఖాతా ల్లో డిపాజిట్లు రూ.90 వేల కోట్లకు చేరువయ్యాయి. ప్రమాద బీమాను రెట్టింపు రూ.2 లక్షల పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. మార్చి 2017 నుంచి పెరుగుతూ వచ్చిన డిపాజిట్లు జనవరి 30 నాటికి రూ.89,257.57 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కేంద్రం ప్రకటించిన పథకాలు సామాన్యులకు నేరుగా అందించాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) పథకాన్ని ఆగస్టు 28, 2014న ప్రారంభించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఖాతా కింద ప్రమాదబీమా మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షలకు పెంచగా, అలాగే ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని కూడా రూ.10 వేలకు పెంచారు. ప్రస్తుత దేశవ్యాప్తంగా 34.14 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయి. సరాసరిగా ఒక్కో ఖాతాల్లో రూ.2,615 డిపాజిట్ చేయగా, మార్చి 25, 2015న ఇది రూ.1,065గా ఉన్నది.

11070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles