ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్

Fri,April 12, 2019 01:14 AM

Demand For Office Space In India

-హైదరాబాద్‌సహా దేశంలోని 8 నగరాల్లో సర్వే
-జనవరి-మార్చిలో 2.5 రెట్లు పెరుగుదల
-వెల్లడించిన కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాలకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో గతంతో పోల్చితే ఆఫీస్ స్పేస్ లీజింగ్ దాదాపు 2.5 రెట్లు ఎగిసింది. 13 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ (సీఅండ్‌డబ్ల్యూ) తా జాగా వెల్లడించింది. నిరుడు 5.3 మిలియన్ చదరపు అడుగులకే ఆఫీస్ స్పేస్ లిజింగ్ పరిమితమైనట్లు స్పష్టం చేసింది. కాగా, కో-వర్కింగ్, ఐటీ రంగాల నుంచి భారీ ఆదరణ కనిపించిందని పేర్కొన్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో సీఅండ్‌డబ్ల్యూ అధ్యయనం జరిగింది. ఈ ఏడాది అన్ని మార్కెట్లు గొప్పగా ప్రారంభమయ్యాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు ఆరంభం నుంచి జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి వ్యవధిలో కార్యాలయ స్థలాల లీజింగ్ నిరుడు ఇదే సమయంతో పోల్చితే సుమారు 2.5 రెట్లు ఎగబాకింది అని సీఅండ్‌డబ్ల్యూ ఇండియా అధిపతి, ఎండీ అన్షుల్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు.

1.41 మిలియన్ చదరపు అడుగులు

దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో 13 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగినట్లు తేలితే.. అందులో హైదరాబాద్ వాటా 1.41 మిలియన్ చదరపు అడుగులు. గతంతో పోల్చితే మూడు రెట్లు ఎగిసింది. ఇక అత్యధికంగా బెంగళూరులో 5.03 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా)లో 2.79 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరుగగా, ముంబైలో 1.57 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతాలో 3,58,500 చదరపు అడుగులు లీజైంది. అతి తక్కువ వృద్ధితో చెన్నైలో 10,12,662 మిలియన్ చదరపు అడుగులకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు పుణెలో 19 శాతం తగ్గి 7,23,156 చదరపు అడుగులకే ఆఫీస్ స్పేస్ లీజులు పరిమితం అవగా, అహ్మదాబాద్‌లో 10 శాతం క్షీణతతో 86,700 చదరపు అడుగులుగా నమోదైంది.

కో-వర్కింగ్ జోష్


కో-వర్కింగ్ సెగ్మెంట్‌లో ఈసారి వృద్ధిరేటు 20 శాతం నమోదైందని ఈ సందర్భంగా జైన్ చెప్పారు. గతేడాది జనవరి-మార్చిలో దాదాపు 7 శాతంగానే ఉందన్నారు. పంచుకున్న ఆఫీస్ స్పేస్‌లో స్వతంత్రంగా లేదా సమష్ఠిగా వ్యక్తులు పనిచేయడమే కో-వర్కింగ్ సెగ్మెంట్. ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయిస్, టెలీకమ్యూటర్, ఫ్రీలాన్స్ వర్కర్లు ఈ సెగ్మెంట్‌లో వినియోగదారులుగా ఉంటారు. కాగా, ఐటీ-బీపీఎం రంగం కూడా వృద్ధిపథంలో ఉందని జైన్ తెలియజేశారు.

భాగ్యనగరానికి యమ క్రేజ్

కొత్తగా కార్యాలయాలను ప్రారంభించాలనుకునే సంస్థలు, వ్యక్తులు హైదరాబాద్ వైపే అధికంగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఇక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, యువతలో నైపుణ్యం వంటివి ఇందుకు కలిసొస్తున్నాయి. ఇప్పటికే దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రముఖ, బహుళజాతి సంస్థల ఆఫీసులు భాగ్యనగరంలో ఉన్న సంగతీ విదితమే. మొత్తానికి సుస్థిర ప్రభుత్వ పాలన, ఆకర్షణీయమైన వ్యాపార, పారిశ్రామిక విధానం.. తెలంగాణను, ముఖ్యంగా రాజధాని నగరమైన హైదరాబాద్‌ను ఆఫీస్ స్పేస్‌కు అడ్డాగా మార్చేస్తున్నాయి.

692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles