హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య ఎయిర్‌ఏషియా రెండు సర్వీసులు

Thu,January 10, 2019 11:25 PM

Delhi to Hyderabad flight service announced by Air Asia

బెంగళూరు, జనవరి 10: విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా మరో ఎనిమిది రూట్లకు నూతన సర్వీసులను ప్రారంభించబోతున్నది. వీటిలో హైదరాబాద్-న్యూఢిల్లీల మధ్య రెండు సర్వీసులను ప్రారంభించనున్న సంస్థ.. న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్, పుణెలకు అదనపు సర్వీసును ఆరంభించబోతున్నది. వచ్చే నెల 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ నూతన సర్వీసుల కోసం గురువారం నుంచే టిక్కెట్ల బుకింగ్‌లను ప్రారంభించింది. ఉదయం 6.05 గంటలకు ఢిల్లీలో బయలుదేరనున్న ఐ5718 విమాన సర్వీసు హైదరాబాద్‌కు 8.15 గంటలకు చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో 8.45 గంటలకు బయలుదేరి ఢిల్లీకి 11 గంటలకు చేరుకోనున్నది. మళ్లీ సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రి 8 గంటలకు చేరుకోనుండగా, తిరిగి 8.25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి ఢిల్లీకి రాత్రి 10.25 గంటలకు చేరుకోనున్నదని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles