జీఎస్టీఎన్‌ను జాతీయం చేయాలి..


Mon,June 19, 2017 02:53 AM

జీఎస్టీ అమలుకు సిట్ ఏర్పాటు చేయాలి..
బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి డిమాండ్

swamy
న్యూఢిల్లీ, జూన్ 18: జీఎస్టీ నెట్‌వర్క్‌ను(జీఎస్టీఎన్) జాతీయం చేయాలని, సంస్థను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, జీఎస్టీని సకాలంలో విజయవంతంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా స్పెషల్ ఇంప్లిమెంటేషన్ టీమ్‌ను (సిట్) ఏర్పాటు చేయాలని ప్రధాని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.

జీఎస్టీఎన్ చైర్మన్‌ను వెంటనే తొలగించాలని సైతం స్వామి డిమాండ్ చేశారు. జీఎస్టీఎన్‌లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంపై సుబ్రమణ్య స్వామి ముందునుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ నెట్‌వర్క్ నిర్వహించనున్న జీఎస్టీఎన్.. కొత్త పరోక్ష పన్నుల విధాన చట్ట అమలులో వెన్నెముకగా వ్యవహరించనుంది. అయితే, ఈ సంస్థలో ప్రైవేట్ సంస్థలతే మెజారిటీ (51 శాతం) వాటా. ప్రభుత్వం 49 శాతం వాటా కలిగి ఉంది. దేశవ్యాప్త సంస్థల వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపులు వంటి సున్నిత సమాచారాన్ని నిర్వహించే జీఎస్టీఎన్‌లో ప్రైవేట్ భాగస్వామ్యులకు మెజారిటీ ఇవ్వడంపై స్వామి గతంలోనే తప్పుబట్టారు. ఈ సంస్థలో ప్రభుత్వమే పూర్తి వాటా కలిగి ఉండాలని, ప్రైవేట్ సంస్థల పాత్రను సేవలకు మాత్రమే పరిమితం చేయాలని కోరుతున్నారు.

174
Tags

More News

VIRAL NEWS