మహీంద్రా లాభంలో క్షీణత

Sat,November 9, 2019 02:27 AM

న్యూఢిల్లీ, నవంబర్ 8:దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఇక్కడ ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 78.44 శాతం క్షీణించి రూ.368.43 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇది రూ.1,708.92 కోట్లుగా ఉన్నది. లాభాల్లో ఎదురుదెబ్బ తగిలిన సంస్థకు ఆదాయంలోనూ నిరాశ తప్పలేదు. 2018-19లో రూ. 25, 431.02 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదా యం గత త్రైమాసికానికిగాను రూ. 23, 935.93 కోట్లకు పడిపోయినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.


వీటిలో ఆటోమోటివ్ విభాగం నుంచి రూ. 12,058.79 కోట్ల ఆదాయం లభించగా, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి రూ.5,369.89 కోట్లు, ఆర్థిక సేవల నుంచి రూ.2,880.12 కోట్లు, ఆతిథ్య సేవల నుంచి రూ.555.37 కోట్లు, రియల్ ఎస్టేట్ నుంచి రూ.329.39 కోట్లు లభించాయి. గత త్రైమాసికంలో సంస్థ 1,10,824 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది విక్రయించిన 1,41,163లతో పోలిస్తే 21 శాతం తగ్గింది. అలాగే ట్రాక్టర్ల అమ్మకాలు 73,012ల నుంచి 68,359లకు పడిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడి పరిస్థితులు కారణంగా వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం పడిందని, మరోవైపు నిధుల కొరత తీవ్రతరమవడం, ఫైనాన్స్ రేట్లు పెరగడం ఆటోమొబైల్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపిందని మహీంద్రా వర్గాలు వెల్లడించాయి.

277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles