గ్లోబల్ ప్రింట్ ఉపాధ్యక్షుడిగా దయాకర్ రెడ్డి

Wed,August 15, 2018 12:54 AM

Dayakar Reddy as Global Print Vice President

హైదరాబాద్, ఆగస్టు 14: గ్లోబల్ ప్రింట్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్ దయాకర్ రెడ్డిని తెలంగాణ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ సంఘం (టీవోపీఏ) అధ్యక్షులు సీ రవీందర్ రెడ్డి అభినందించారు. దయాకర్ రెడ్డి ప్రస్తుతం భారతీయ ప్రచురణ, యంత్ర తయారీదారుల అనుబంధ సంఘం (ఐపీఏఎంఏ-న్యూఢిల్లీ) అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేగాక ఆసియా ప్రింట్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ఆయన టీవోపీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో చిన్న వయసులోనే ఐపీఏఎంఏ అధ్యక్షుడిగా ఎన్నికై ఇప్పటికే రికార్డు సృష్టించిన దయాకర్ రెడ్డి.. ఇప్పుడు గ్లోబల్ ప్రింట్ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదుగడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ప్రతిష్ఠను జాతీయ, ఆసియా, అంతర్జాతీయ స్థాయిల్లో దయాకర్ రెడ్డి చాటారని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రవీందర్ రెడ్డి కొనియాడారు. జపాన్ రాజధాని టోక్యోలో ఇటీవల జరిగిన ఐజీఏఎస్-2018 సమావేశంలో గ్లోబల్ ప్రింట్ ఉపాధ్యక్షుడిగా దయాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు.

290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS