సైయెంట్ రూ.5 మధ్యంతర డివిడెండ్


Fri,October 13, 2017 12:56 AM

క్యూ2లో లాభం రూ.111 కోట్లు
cyient
హైదరాబాద్, అక్టోబర్ 12: రాష్ర్టానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ సైయెంట్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు అంచనాలకుమించి నమోదయ్యా యి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ. 111.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.97.3 కోట్ల లాభంతో పోలిస్తే 14.6 శాతం ఎగబాకింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో కంపెనీ ఆదాయం రూ.913.6 కోట్ల స్థాయి నుంచి రూ.965.40 కోట్లకు ఎగబాకింది. ఆర్థిక ఫలితాలు అంచనావేసినట్లుగానే ఉన్నాయని, ముఖ్యంగా ఆదాయం రికార్డు స్థాయి లో పెరిగి 150.1 మిలియన్ డాలర్లుగా నమోదైనట్లు సైయెంట్ ఎండీ, సీఈవో కృష్ణ బొడనపు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన షేరుకు అంతే విలువ కలిగిన రూ.5 షేరును మధ్యంతర డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు.

142

More News

VIRAL NEWS