విద్యా రుణాల్లోకి క్రేజీబీ

Wed,September 12, 2018 12:19 AM

Crazy Bee the largest company in the country to offer micro loans

హైదరాబాద్, సెప్టెంబర్ 11: సూక్ష్మ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థయైన క్రేజీబీ..తాజాగా విద్యా రుణాల విభాగంలోకి అడుగుపెట్టబోతున్నది. విద్యార్థుల అవసరార్థం ల్యాప్‌టాప్, ఉన్నత చదువులకోసం రూ.25 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణంగా ఇవ్వనున్నట్లు క్రేజీబీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి గౌరినాథ్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.148 కోట్ల రుణాలను ఇవ్వగా, ఈ ఏడాది రూ.500-600 కోట్ల వరకు పెంచాలనుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొదించడానికి హెడ్‌నెక్ట్స్ స్టార్టప్ ఫెస్ట్ 2018 పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 28న తుది ముగ్గురు విజేతలను ప్రకటించనున్నది. ఇలా ఒక్కో విజేతకు రూ.3 లక్షల చొప్పున బహుమతిగా అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles