అమెజాన్‌కు రూ.1.3 కోట్ల కుచ్చుటోపీ

Tue,March 13, 2018 02:03 AM

Courier delivery agent defrauds Amazon of Rs. 1.3 crore Here how he managed

బెంగళూరు: అమెజాన్‌కు రూ.1.3 కోట్ల మేరకు టోకరా వేశాడో కొరియర్ బాయ్. ఏకదంత కొరియర్ ఏజెన్సీలో పనిచేస్తున్న 25 ఏండ్ల దర్శన్.. తన స్నేహితులతో కలిసి అమెజాన్‌లో వస్తువులను ఆర్డర్ చేస్తూ ఈ మోసానికి పాల్పడ్డాడు. తమ ఏజెన్సీకి అమెజాన్‌తో ఉన్న ఒప్పందాన్ని ఆసరా చేసుకున్న దర్శన్.. గతేడాది సెప్టెంబర్ నుంచీ ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేసి, వాటికి డబ్బులు చెల్లించకుండా ఎగవేశాడు. అమెజాన్ కార్డ్ పేమెంట్ వ్యవస్థను హ్యాక్ చేసి కస్టమర్లు డబ్బులు చెల్లించినట్లు చూపగా, ఆ తర్వాతి ఆడిటింగ్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై దృష్టి సారించిన అమెజాన్ వర్గాలు.. మోసాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కాగా మొత్తం 4,604 ఆర్డర్లు చేసినట్లు తెలుస్తుండగా, రూ.25 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

731

More News

VIRAL NEWS