పీఎస్‌బీలను ప్రైవేటీకరించాలి: ఫిక్కీ

Tue,February 20, 2018 12:41 AM

Consider privatising public sector banks FICCI to govt

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ డిమాండ్ చేస్తున్నది. గడిచిన పదకొండు సంవత్సరాల్లో రూ.2.6 లక్షల కోట్ల మేర నిధులు కేటాయించినప్పటికీ పీఎస్‌బీలు ఆర్థికంగా బలోపేతం కాలేదని, ఈ నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమే కేంద్రం ముందున్న ప్రత్యామ్యాయమని ఫిక్కీ వర్గాలు సూచించారు. పీఎన్‌బీలో జరిగిన రూ. 11,400 కోట్ల కుంభకోణాన్ని ఉదాహరిస్తు ఫిక్కీ ఈ సూచనలు చేసింది. నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదని, ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే పీఎస్‌బీలను ప్రైవేటీ కరించడమే ముఖ్యమని ఫిక్కీ ప్రెసిడెంట్ రాశేష్ షా తెలిపారు. వాటాల విక్రయం ద్వారా సేకరించిన నిధులను కేంద్రం ప్రకటించిన స్కీంలకు, అభివృద్ధి పథకాలకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. దేశీయ బ్యాంకింగ్ రంగంలో 70 శాతం వాటా కలిగిన పీఎస్‌బీలు ప్రస్తుతం మొండి బకాయిలతో సతమతమవుతున్నాయి.

217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS