అవినీతికి మూల్యం

Sun,February 17, 2019 02:00 AM

Cognizant to settle Tamil Nadu graft case in US with $28 million

అమెరికా ఎస్‌ఈసీకి రూ.180 కోట్లు చెల్లించనున్న కాగ్నిజెంట్
వాషింగ్టన్, ఫిబ్రవరి 16: అమెరికా ఐటీ రంగ దిగ్గజం కాగ్నిజెంట్.. ఆ దేశ సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కు దాదాపు రూ.180 కోట్ల (25 మిలియన్ డాలర్లు)ను చెల్లించనున్నది. భారత్‌లో వచ్చిన లంచం ఆరోపణలకుగాను సెటిల్మెంట్ కింద ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు కాగ్నిజెంట్ అంగీకరించినట్లు ఎస్‌ఈసీ తెలిపింది. కాగ్నిజెంట్ మాజీ ఉద్యోగులపై అమెరికా న్యాయ శాఖ క్రిమినల్ కేసులను దాఖలు చేసింది. ఈ క్రమంలోనే విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సీపీఏ) ఉల్లంఘన చర్యలను పరిష్కరించడంలో భాగంగా ఈ మొత్తాన్ని ఎస్‌ఈసీకి కాగ్నిజెంట్ ఇవ్వనున్నది.

ఎస్‌ఈసీ తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలో 2.7 మిలియన్ చదరపు అడుగుల కాగ్నిజెంట్ క్యాంపస్ భవనాన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ నుంచి అనుమతుల కోసం 2014లో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.15 కోట్లు) లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో కాగ్నిజెంట్ అధ్యక్షుడు గార్డన్ కోబర్న్, సంస్థ చీఫ్ లీగల్ ఆఫీసర్ స్టీవెన్ ఈ స్కార్ట్‌లు ఆ మొత్తాన్ని ఇవ్వాలంటూ కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ లంచం వ్యవహారం బయటకు పొక్కనివ్వకూడదని తమ కిందిస్థాయి అధికారులనూ ఆదేశించారు.
www.learncab.com పొర్టల్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు. సీఏ, సీఎస్, సీఎంఏఎస్‌ల ప్రొఫెషనల్స్ కోసంప్రత్యేకంగా ఈ పొర్టల్‌ను అందుబాటులోకితీసుకొచ్చారు.

1258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles