పౌల్ట్రీ పరిశ్రమకు సీఎం భరోసా

Sat,February 9, 2019 12:10 AM

CM Assure to the poultry industry

-సబ్సిడీపై 4 లక్షల టన్నుల మొక్కజొన్న సరఫరా
-రాష్ట్ర మార్క్‌ఫెడ్ ద్వారా కిలో రూ.18కే అందించాలని ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 8: సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. అధిక కోళ్ల దాణా వ్యయం, వ్యాధులు, తక్కువ మార్కెట్ ధరలతో ఇబ్బందిపడుతున్న పౌల్ట్రీ రంగ కష్టాలపై సీఎం సానుకూలంగా స్పందించారు. తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అండ్ నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీలు.. పౌల్ట్రీ రైతుల వెతల ను ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ క్రమంలోనే 4 లక్షల టన్నుల మొక్కజొన్నను కిలో రూ.18కే తెలంగాణ మార్క్‌ఫెడ్ ద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో సీఎం కేసీఆర్‌కు తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ రంజిత్ రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా మొక్కజొన్న దిగుబడి తక్కువగా ఉండటంతో కోళ్ల దాణా ఉత్పత్తిలో సమస్యలను ఎదుర్కొంటున్నామని, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడుతున్నదని, దీంతో ఖర్చు పెరుగుతున్నదని ముఖ్యమంత్రి వద్ద పరిశ్రమ మొరపెట్టుకున్నది. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, తెలంగాణ పౌల్ట్రీ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కూ పరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసింది.

960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles