రూ.5 లక్షలకు పెంచాలి

Wed,January 9, 2019 11:36 PM

CII pre budget demand income tax exemption till 5 lakh in interim budget 2019

- ఐటీ మినహాయింపుపై సీఐఐ డిమాండ్
న్యూఢిల్లీ, జనవరి 9: వ్యక్తిగత ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ డిమాండ్ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రూ.2.50 లక్షలుగా ఉన్న ఐటీ మినహాయింపును రెట్టింపు చేయాలని కోరింది. ఈ మేరకు ముందస్తు బడ్జెట్ సిఫార్సుల్లో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు సీఐఐ సూచించింది. ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఐటీ పన్ను నుంచి మినహాయింపు లభిస్తున్నది. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 20 శాతం, ఆపై ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను అమల్లో ఉన్నది.

ఈ నేపథ్యంలో గరిష్ఠ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలంటున్న సీఐఐ.. దీన్ని రూ.20 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్నవారికి వర్తింపజేయాలని కోరుతున్నది. రూ.10 లక్షల నుంచి 20 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్నవారి కోసం కొత్త శ్లాబును సృష్టించి వారికి 20 శాతం పన్ను వేయాలని సూచించింది. అంతేగాక రూ.5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయం గలవారికి 10 శాతం పన్నునే వేయాలన్నది. ఇకపోతే టర్నోవర్‌తో సంబంధం లేకుండా కార్పొరేట్ పన్ను రేటునూ 25 శాతానికి తగ్గించాలని సీఐఐ ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది. దశలవారీగా దీన్ని 18 శాతానికి తీసుకురావాలని కోరింది. సెక్షన్ 80సీ కింద కోతల పరిమితిని రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచాలన్నది.

2161
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles