చైనాలో 20 లక్షల ఉద్యోగాలు ఔట్!

Tue,August 20, 2019 02:08 AM

China lost 20 lakhs jobs in short period of time

-అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్, ఆగస్టు 19: అతి త్వరలోనే చైనాలో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు పోనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. అదనపు సుంకాలతోపాటు తన కఠిన విధానాలే ఇందుకు కారణమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ చాలాచాలా పేలవంగా నడుస్తున్నది. తప్పుడు ద్రవ్యవిధానాలతో ఆ దేశం ఇన్నాళ్లూ ప్రయోజనాలను పొందింది. ఇప్పుడు ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆ సొమ్మునే గుమ్మరిస్తున్నది అని ఆదివారం విలేఖరులతో అన్నారు. కాగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇటీవల మాట్లాడారన్న దానిపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. మరోవైపు హువావీపై నిషేధాన్ని సోమవారం అమెరికా 90 రోజు లు వాయిదా వేసింది. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా హువావీ తీరున్నదంటూ అగ్రరాజ్యం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

537
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles