బీఎస్‌ఎన్‌ఎల్ నుంచీ చౌక ఫోన్!

Wed,October 11, 2017 11:58 PM

Cheap phone from BSNL

BSNL
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రైవేట్ సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సైతం చౌక ధర స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌లు అతి తక్కువ ధర కలిగిన 4జీ మొబైళ్లను విడుదల చేయగా.. బీఎస్‌ఎన్‌ఎల్ సైతం ఈ ఏడాది చివరి నాటికి ఈ తరహా మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు విభిన్న వర్గాల ద్వారా తెలిసింది. ఈ మొబైల్ ధర సుమారుగా రూ.2,200 ఉన్నప్పటికీ సబ్సిడీ కింద రూ.1,600కే విక్రయించే యోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాధారణ మొబైళ్లలో ఉండే అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో ఉండనున్నాయని ఈ వర్గాలు తెలిపాయి. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసిన వారు ప్రతినెల రూ.97తో రీచార్జి చేసుకుంటే నెలపాటు ఉచితంగా కాలింగ్ చేసుకునే అవకాశం సంస్థ కల్పించనున్నది. ఈ మొబైల్‌ని కొనుగోలుదారులకు అందించడానికి బీఎస్‌ఎన్‌ఎల్.. మైక్రోమాక్స్, లావా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నది.

282
Tags

More News

VIRAL NEWS

Featured Articles