కార్పొరేట్ మోసాలపై దృష్టి కఠిన నిబంధనల్ని తెస్తున్నాం

Sun,June 9, 2019 12:06 AM

Chartered accountants facing most heat today as norms are strong Srinivas

-చార్టెడ్ అకౌంటెంట్లపై పెరిగిన ఒత్తిడి
-కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్
న్యూఢిల్లీ, జూన్ 8: ఇటీవలికాలంలో కార్పొరేట్ సంస్థల్లో వరుస మోసాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నిబంధనల్ని కఠినతరం చేస్తున్నామని కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. దీంతో చార్డెడ్ అకౌంటెంట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుంభకోణం తదితర కేసుల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై దృష్టి పెట్టామని చెప్పారు. శనివారం ఇక్కడ ఓ జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన ఆడిటింగ్ వ్యవస్థ ప్రమాణాలను పెంచే పనిలో కేంద్రం పడిందన్నారు. కార్పొరేట్ సంస్థల కుంభకోణాల వెనుక ఆడిటర్ల పాత్రపై ఆరా తీస్తున్నామన్న ఆయన దీనివల్ల చార్డెడ్ అకౌంటెంట్లు నేడు తీవ్ర అలజడికి లోనవుతున్నట్లు తెలిపారు. విలువ లెక్కింపుదారులు ఎందుకు నియంత్రణలో లేకుండా పోయారో.. తెలుసా? అని ప్రశ్నించిన ఆయన వారికంటూ ఓ ఇనిస్టిట్యూట్ లేకపోవడం వల్లేనని అన్నారు. దీనికంటూ ప్రమాణాలు, మార్గదర్శకాలూ ఏవీ లేవన్నారు. క్లయింట్లు కోరుకున్నట్లుగా విలువను లెక్కిస్తే.. అక్రమాలే జరుగుతాయని, నిస్వార్థంగా, నిజాయితీగా చార్డెడ్ అకౌంటెంట్లు తమ విధులను నిర్వర్తిస్తే కార్పొరేట్ కుంభకోణాలకు, ఆర్థిక మోసాలకు తావుండదన్నారు. కొన్ని చార్డెడ్ అకౌంటెంట్ సంస్థలు సైతం తప్పుదారిలో వెళ్తున్నాయని, చార్డెడ్ అకౌంటెంట్లలో నిజాయితీ పెరుగాలని గతంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles