ఈడీ విచారణకు చందా కొచ్చర్ డుమ్మా

Tue,June 11, 2019 12:16 AM

Chanda kochhar did not come to inquiry in front of ED

న్యూఢిల్లీ, జూన్ 10: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరు కాలేదు. వీడియోకాన్ గ్రూపునకు రుణ మంజూరు విషయంపై ఈడీ ముందుకు సోమవారం హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో మరోసారి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేయనున్నది. గతవారం కూడా ఇదే కారణాలతో ఆమె విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, ఈ కేసులో మరికొంతమంది బ్యాంకు అధికారులను కూడా త్వరలో ప్రశ్నించనున్నట్లు అంతకుముందు ఈడీ అధికారులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్‌కు రూ.1,8 75 కోట్ల రుణమిచ్చిన వ్యవహారంలో ఈడీ ఇప్పటికే కొచ్చర్‌కు, ఆమె భర్త దీపక్ కొచ్చర్, మరిది రాజీవ్ కొచ్చర్‌లను పలుమార్లు విచారించినది తెలిసిందే.

367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles